బీజేపీకి కొత్త భాష్యం చెప్పిన తులసిరెడ్డి

  • ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేసిన తులసిరెడ్డి
  • ఆ మూడూ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారాయని వ్యాఖ్య 
  • ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర సాగుతుందన్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త భాష్యం చెప్పారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తోందన్న ఆయన.. వైసీపీ, టీడీపీ, జనసేన మూడూ ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. 

ఏపీలో కాంగ్రెస్ త్వరలో చేపట్టనున్న ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. యాత్ర రాయదుర్గంలో ప్రారంభమై రెండు పార్లమెంటు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Tulasi Reddy
Congress
BJP
Jagan
Chandrababu
Pawan Kalyan

More Telugu News